ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విడుదల తేదీ లాక్ చేసిన 'హిట్ 2' హిందీ వెర్షన్

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 22, 2022, 08:18 PM

శైలేష్ కొలను దర్శకత్వం వహించిన 'హిట్ 2' డిసెంబర్ 2, 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. అడివి శేష్ మరియు మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమా తొలి షోల నుండి పాజిటివ్ రిపోర్ట్స్ అందుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో నార్త్ ప్రేక్షకులు హిందీ వెర్షన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో శేష్ మాట్లాడుతూ.. హిందీలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.


తాజగా ఇప్పుడు, ఈ సూపర్ హిట్ చిత్రం డిసెంబర్ 30, 2022న నార్త్ లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. హిందీలో గ్రాండ్ మాస్టర్ మరియు బి4యు మోషన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయి. రావు రమేష్, భాను చందర్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.


ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. జాన్ స్టీవర్ట్ ఎడూరి 'హిట్ : ది సెకండ్ కేసు' కి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com