సూపర్ స్టార్ మహేష్ బాబు తో సర్కారు వారి పాట పాడించిన డైరెక్టర్ పరశురామ్ పెట్ల పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేస్తున్నారు.
నిఖిల్ సిద్దార్ధ "యువత" సినిమాతో డైరెక్టోరియల్ డిబట్ చేసిన పరశురామ్ అంతకుముందు వరకు పూరీజగన్నాధ్, బొమ్మరిల్లు భాస్కర్ ల దగ్గర పనిచేసారు. ఆపై ఆంజనేయులు, సోలో, సారొచ్చారు, శ్రీరస్తు, శుభమస్తు, గీతా గోవిందం, సర్కారువారి పాట సినిమాలను పరశురామ్ డైరెక్ట్ చేసారు. ఈ సినిమాలన్నిటిలో గీతా గోవిందం బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది. సూపర్ స్టార్ తో సర్కారువారి పాట పాడించే అవకాశాన్ని కల్పించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa