కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు, టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కలయికలో రూపొందుతున్న బై లింగువల్ మూవీ "కస్టడీ". ఈ సినిమాకు మ్యాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మ్యాస్ట్రో యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి లేటెస్ట్ గా మేకర్స్ ఒక అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. అదేంటంటే, అక్కినేని అభిమానులు న్యూ ఇయర్ ని మరింత జాయ్ ఫుల్ గా సెలెబ్రేట్ చేసుకునేందుకు కస్టడీ నుండి బ్లాస్టింగ్ అప్డేట్ ను ఆ రోజు ఇవ్వబోతున్నట్టు కొంతసేపటి క్రితమే ఎనౌన్స్ చేసారు. ఈ సందర్భంగా ఆడియన్స్ కు క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియచేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa