స్టార్ మా ఛానెల్లో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 5 విన్నర్ VJ సన్నీ హీరోగా నటిస్తున్న సినిమా "అన్స్టాపబుల్". డైమండ్ రత్నబాబు డైరెక్షన్లో ఔటండౌట్ ఫన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నక్షత్ర త్రినయని హీరోయిన్ గా నటిస్తుంది. సప్తగిరి కీరోల్ లో నటిస్తున్నారు. A2B ప్రొడక్షన్స్ బ్యానర్ పై రంజిత్ రావు నిర్మిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేసారు. ఈ మేరకు రేపు ఉదయం 11:12 నిమిషాలకు అన్స్టాపబుల్ మూవీ టీజర్ ను కింగ్ నాగార్జున విడుదల చెయ్యబోతున్నట్టు అధికారిక ప్రకటన విడుదలైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa