టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తొలిసారి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం "మైఖేల్". రంజిత్ జయకోడి దర్శకత్వంలో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను భరత్ చౌదరి, రామ్మోహన్ రావు, నారాయణదాస్ నారంగ్ నిర్మిస్తున్నారు. దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్గా నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్గా నటిస్తున్న ఈ మూవీలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, యంగ్ హీరో వరుణ్ సందేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు.
ఈ రోజు క్రిస్మస్ పండగను పురస్కరించుకుని మైఖేల్ టీం మ్యూజికల్ ప్రమోషన్స్ ను షురూ చేసింది. ఈ మేరకు కొంతసేపటి క్రితమే ఫస్ట్ లిరికల్ 'నీవుంటే చాలు' సాంగ్ ను డిసెంబర్ 28వ తేదీన విడుదల చేయబోతున్నట్టు పేర్కొంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa