ప్రపంచవ్యాప్తంగా నిన్న క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో మన స్టార్స్ కూడా క్రిస్మస్ పండగను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. కొంతమంది సెట్స్ లో మరికొంతమంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో జరుపుకోవడం జరిగింది.
మన రౌడీ హీరో ...అకా ..విజయ్ దేవరకొండ నిన్న క్రిస్మస్ వేడుకలను ఇంటిలోనే కుటుంబంతో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు విజయ్ తన ట్విట్టర్ ఖాతాలో అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియచేస్తూ.. వాళ్ళ ఇంట్లో క్రిస్మస్ ఎలా జరిగిందో చూపిస్తూ ఫ్యామిలీ తో కలిసి దిగిన పిక్ ను షేర్ చేసారు.
ప్రస్తుతం విజయ్ సినిమాల షూటింగ్స్ లో కాకుండా కమర్షియల్ యాడ్స్ షూట్ లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్నారు. శివ నిర్వాణ డైరెక్షన్లో రూపొందుతున్న ఖుషి సమంత అనారోగ్యం కారణంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో విజయ్ నుండి న్యూ ప్రాజెక్ట్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో అని విజయ్ ఫ్యాన్స్ కుతూహలంగా ఎదురుచూస్తున్నారు.