మాస్ రాజా రవితేజ న్యూ మూవీ 'ధమాకా' థియేటర్లలో ఊరమాస్ సందడి చేస్తుంది. రెండు డిజాస్టర్ల తదుపరి వచ్చిన ధమాకాకు రవితేజ అభిమానులు బ్రహ్మరధం పడుతున్నారు. తొలిరోజు తొలిషో నుండే హిట్ టాక్ తెచ్చుకుని హౌస్ఫుల్ ధియేటర్ రన్ జరుపుకుంటున్న ధమాకా ప్రపంచవ్యాప్తంగా మూడ్రోజుల్లో 32కోట్ల గ్రాస్ వసూళ్లను వసూలు చేసినట్టు అధికారికంగా తెలుస్తుంది. డే 1 కన్నా...డే 3 ధమాకా వసూళ్లు ఎక్కువగా ఉండడం విశేషం.
నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో ఔటండౌట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా, భీమ్స్ సంగీతం అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది.