నిఖిల్ సిద్దార్థ, అనుపమల "18 పేజెస్" క్రేజీ లవ్ స్టోరీకి ఆడియన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా షోలు జరుగుతున్నకొద్దీ హవా పెంచుకుంటూ పోతుంది. ఈ మేరకు శుక్రవారం కన్నా ఆదివారం అంటే నిన్న 18 పేజెస్ థియేటర్లు హౌస్ ఫుల్ అయినట్టు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మూడ్రోజుల్లో 11కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి నిర్మాతలను లాభాల బాటలో నడిపిస్తుంది.
సుకుమార్ కథ, డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ టేకింగ్, గోపీసుందర్ మెస్మైరైజింగ్ మ్యూజిక్, నిఖిల్, అనుపమల అద్భుతమైన పెర్ఫార్మన్స్ లతో ఈ సినిమా ఆడియన్స్ ను ఫుల్ ఫిదా చేస్తుంది.