ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్రవేసిన బుల్లితెర నటుడు సోహెల్ రియాన్. బిగ్ బాస్ 5 సెకండ్ రన్నర్ అప్ గా నిలిచిన సోహెల్ హీరోగా నటిస్తున్న చిత్రం "లక్కీ లక్ష్మణ్". ఇందులో మోక్ష హీరోయిన్ గా నటిస్తుంది. AR అభి దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
ఈ నెల 30వ తేదీన థియేటర్లకు రావడానికి సిద్ధపడిన ఈ సినిమా నుండి తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ వచ్చింది. ఈ మేరకు రేపు రాత్రి ఏడు గంటల నుండి హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో లక్కీ లక్ష్మణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని తెలుపుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చెయ్యడం జరిగింది.