టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి కొన్ని రోజుల క్రితమే వెకేషన్ కి వెళ్లారు. సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ తన పర్సనల్ లైఫ్ గురించి చాలా లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తారన్న విషయం తెలిసిందే కదా. ఐతే, ఈ సారి తన వెకేషన్ కి సంబంధించిన అప్డేట్ ను తారక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు చేరవేశారు.
ఇంటర్నేషనల్ ట్రిప్ లో చాలా మంచి భారతీయ ఆహారాన్ని తినగలిగాను.. దీంతో నా టేస్ట్ బడ్స్ కు కొంచెం స్పైస్ యాడ్ అయినట్టయ్యింది...అని పేర్కొంటూ హోటల్ సిబ్బందితో దిగిన పిక్ ను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసారు. దీనిని బట్టి తారక్ జునూన్, NYC లో కమ్మనైన ఇండియన్ ఫుడ్ ను ఆస్వాదించారని తెలుస్తుంది.