మెగాస్టార్ చిరంజీవి గారు, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ "వాల్తేరు వీరయ్య". బాబీ ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా, థమన్ సంగీతదర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రవి శంకర్, నవీన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజా బజ్ ప్రకారం, వాల్తేరు వీరయ్య ట్రైలర్ జనవరి 4వ తేదీన విడుదల కాబోతుందని ముమ్మర ప్రచారం జరుగుతుంది. అలానే ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి జనవరి 8న వైజాగ్ లో జరగనుందని టాక్ నడుస్తుంది. మరి అతి త్వరలోనే ఈ రెండు విషయాలపై మేకర్స్ నుండి అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
మాస్ రాజా రవితేజ కీరోల్ లో నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదల కాబోతుంది.