ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకటో తేదీ గుడ్‌న్యూస్.. తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర

business |  Suryaa Desk  | Published : Sun, Mar 01, 2026, 11:54 PM

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఒకటో తేదీన శుభవార్త లభించింది. మార్చి 1వ తేదీన దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుభవార్త చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరలని సవరించాయి. హోలీ పండుగకి ముందే గ్యాస్ వినియోగదారులు ఉపశమనం లభించింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు ఈ రోజు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. తాజా నిర్ణయంతో గ్యాస్ వినియోగదారులకి కొత్త ఊరట లభించినట్లయింది. దేశంలోని మెట్రో నగరాల్లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరని రూ. 31 మేర తగ్గిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ఈ కొత్త గ్యాస్ సిలిండర్ ధరలు మార్చి 1 నుంచే అమల్లోకి వస్తాయని తెలిపాయి. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదని వెల్లడించాయి.


సాధారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా 1వ తేదీన వంట గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షిస్తాయి. ధరలు పెంచడం లేదా తగ్గించడం లేదా యథాతథంగా కొనసాగించడం వంటివి చేస్తుంటాయి. ఇలా సవరించిన LPG గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెలా 1వ తేదీ నుంచి అమలులోకి తీసుకొస్తుంటాయి. అంతర్జాతీయ చమురు ధరలు, ట్యాక్సేషన్ పాలసీలు, సరఫరా - డిమాండ్ వంటి కారణాలతో గ్యాస్ సిలిండర్ ధరలను నిర్ణయిస్తారు.


తాజా గ్యాస్ సిలిండర్ ధరల తగ్గింపు తర్వాత హైదరాబాద్ లో 19 కేజీల కమెర్షియల్ సిలిండర్ ధర రూ.31 తగ్గి రూ. 1930.50 వద్దకు తగ్గింది.


విజయవాడలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 31 తగ్గి రూ. 1867.50 వద్దకు దిగొచ్చింది.


దేశ రాజధాని ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.31 తగ్గి రూ. 1709గా ఉంది.


కోల్‌కత్తాలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ రేటు రూ.31 తగ్గడంతో రూ. 1844.5 వద్దకు దిగివచ్చింది.


ముంబైలో రూ. 1692 గా ఉండగా బెంగళూరులో రూ. 1783, చెన్నైలో రూ. 1899.5గా రేట్లు ఉన్నాయి.


మరోవైపు 14 కిలోల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మార్చలేదు. ఈరోజు హైదరాబాద్లో డొమస్టిక్ గ్యాస్ సిలిండర్ రేటు రూ. 905 గా ఉంది. విజయవాడలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రేటు రూ. 877.50, దేశ రాజధాని ఢిల్లీలో రూ. 853 గా, కోల్‌కత్తాలో రూ. 879 వద్ద ఉన్నాయి. ముంబైలో రూ. 852.5, ఇక చెన్నైలో రూ. 868.50 గాను రేట్లు ఉన్నాయి. బెంగళూరులో ఒక్కో సిలిండర్ ధర రూ. 855.50గా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa