పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో బంగారం ముడిపడి ఉంది. అంతే కాదు పెట్టుబడి పెట్టే వారు సైతం బంగారం సురక్షితమైన మార్గంగా చూస్తున్నారు. పసిడితో పాటు వెండికీ మంచి గిరాకీనే ఉంది. అందుకే వీటి ధరలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండడం చాలా ముఖ్యం. గత కొద్ది నెలల నుంచి బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. ఇటీవల కాస్త తగ్గినట్లు కనిపించినా అమెరికా- ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు పసిడి ధరలను అమాంతం పెంచేశాయి. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకపడడం, ఊహించని విధంగా ఇరాన్ ప్రతిదాడులు చేయడం ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీంతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. తులం బంగారం రేటు ఏకంగా రూ.7 వేల పైన పెరిగింది. అలాగే కిలో వెండి రేటు ఒక్కరోజే రూ.25000 మేర పెరిగింది. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు మార్చి 1వ తేదీన ఏ స్థాయికి చేరుకున్నాయో తెలుసుకుందాం.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఒక్కరోజే 100 డాలర్ల పైన పెరిగింది. దీంతో ఔన్స్ గోల్డ్ రేటు 5278 డాలర్ల పైకి చేరి ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు ఒక్కరోజే 7.59 శాతం పెరిగింది. దీంతో ఔన్స్ వెండి రేటు 93.72 డాలర్ల పైకి చేరుకుంది. అమెరికా-ఇరాన్ యుద్ధం, ఇజ్రాయెల్ ఎంట్రీ వంటి కారణాలు బంగారం ధరలు పెరిగేందుకు కారణమయ్యాయి.
హైదరాబాద్లో బంగారం ధర
అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు దేశీయ మార్కెట్ పై ప్రభావం చూపించాయి. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈరోజు 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు ఏకంగా రూ.7140 మేర పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ. 1,68,710 వద్దకు చేరుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ. 6,550 మేర పెరిగింది. దీంతో తులం రేటు రూ.1,54,650 వద్దకు చేరుకుంది.
రూ.25000 పెరిగిన వెండి
బంగారంతో పాటు వెండి రేటు సైతం భారీగా పెరిగింది. గత రెండు రోజులు స్థిరంగా కొనసాగుతూ వచ్చిన వెండిపై ఇరాన్-అమెరికా దాడులు ప్రభావం చూపించాయి. దీంతో ఒక్కరోజే కిలో వెండి రేటు రూ.25000 మేర పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 3,20,000 వద్దకు చేరుకుంది.
పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్చి 1వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి. అయితే, బులియన్ మార్కెట్లో పసిడి రేట్లు మధ్యాహ్నానికి మారిపోతుంటాయి. కొనుగోలు చేసే ముందు స్థానికంగా ధరలు తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే ప్రాంతాలను బట్టి ధరలు వేరు వేరుగా ఉండవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa