ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విండీస్‌తో మ్యాచ్‌లో 10 రన్స్‌కి ఔట్,,,,మళ్లీ విఫలమైన అభిషేక్ శర్మ

sports |  Suryaa Desk  | Published : Sun, Mar 01, 2026, 11:42 PM

టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా.. పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత యువ ఆటగాళ్లకు ఎక్కువగా అవకాశాలు లభించాయి. అందివచ్చిన అవకాశాలను కుర్రాళ్లు రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. దీంతో టీ20 క్రికెట్‌లో భారత జట్టుకు తిరుగులేకుండా పోయింది. జట్టు ఏదైనా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగింది. ముఖ్యంగా టీమిండియా విజయాల్లో ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ .. కీలక పాత్ర పోషించాడు. తన మెరుపు బ్యాటింగ్‌తో జట్టుకు శుభారంభాలు అందించాడు. టీ20 ప్రపంచకప్ 2026లోనూ అతడు సత్తాచాటుతాడని అంతా భావించారు.


కానీ ప్రస్తుతం.. సీన్ రివర్స్ అయింది. ఎన్నో అంచనాలతో తొలిసారి టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగిన అభిషేక్.. దారుణ ప్రదర్శన చేస్తున్నాడు. తొలి మూడు మ్యాచ్‌లలో వరుసగా మూడు డకౌట్లు నమోదు చేశాడు. ఆ తర్వాత 15 పరుగులు చేశాడు. గత మ్యాచ్‌లో 55 రన్స్‌తో ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించిన అభిషేక్.. తాజాగా వెస్టిండీస్‌తో కీలకమైన మ్యాచ్‌లో మరోసారి విఫలమయ్యాడు. 11 బంతుల్లో 10 రన్స్ చేసి ఔట్ అయ్యాడు.


మొత్తంగా ఈ టోర్నీలో ఆడిన ఆరు ఇన్నింగ్స్‌లలో అతడు.. 80 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో మూడు డకౌట్స్ ఉన్నాయి. అభిషేక్.. 13.33 సగటుతో.. 131 స్ట్రైక్ రేట్‌తో ఈ రన్స్ స్కోరు చేశాడు. ఈ టోర్నీకి ముందు వరకు 200లకు పైగా స్ట్రైక్ రేట్‌తో రన్స్ చేసిన అభిషేక్.. ఇప్పుడు మాత్రం ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నాడు. జట్టుగా బలంగా మారుతాడనకుంటే.. బలహీనతగా మారిపోయాడు.


వెస్టిండీస్‌తో మ్యాచులోనూ నిరాశపరిచాడు. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో రెండు క్యాచ్‌లు మిస్ చేసిన అతడు.. 196 పరుగుల లక్ష్య ఛేదనలో 11 బంతుల్లో 10 రన్స్ చేసి ఔట్ అయిపోయాడు. మిగతా బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. దీంతో ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్న అభిషేక్‌పై సోషల్ మీడియాలో అతడిపై విమర్శల వర్షం కురుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa