గోపీచంద్ మలినేని డైరెక్షన్లో నటసింహం నందమూరి బాలకృష్ణ గారు "వీరసింహారెడ్డి" సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీరోల్స్ లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది.
ఈ సినిమా షూటింగ్ పార్ట్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేయగా, బ్యాలన్స్ సాంగ్ షూట్ ను హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో కొన్నిరోజుల నుండి మేకర్స్ జరుపుతున్న విషయం తెలిసిందే కదా. తాజా సమాచారం ప్రకారం, నిన్ననే వీరసింహారెడ్డి షూటింగ్ మొత్తం పూర్తి అయినట్టు తెలుస్తుంది. ఇక, మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ ను మరింత ముమ్మరం చేసే అవకాశం కనిపిస్తుంది.