టీమిండియా స్టార్ పేసర్ Jasprit Bumrah అద్భుత బౌలింగ్‌తో మెరిపించాడు. ICC Men's T20 World Cup 2026 టోర్నీలో భాగంగా కోల్‌కతా వేదికగా West Indies cricket teamతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో బుమ్రా ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు సాధించి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు.తన పదునైన డెలివరీలతో ప్రమాదకర బ్యాటర్ Shimron Hetmyer (12 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 27), అలాగే సెట్ అయిన Roston Chase (25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 40)లను పెవిలియన్‌కు పంపించాడు. వరుస బంతుల్లో వికెట్లు తీసి టీమిండియాకు కీలక బ్రేక్‌థ్రూ అందించాడు.బుమ్రా వేసిన 12వ ఓవర్లో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఓవర్ మూడో బంతికి హెట్‌మైర్ క్యాచ్ ఔటయ్యాడు. అయితే ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అతను రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో బంతి బ్యాట్‌కు తగిలి, స్వల్పంగా జెర్సీని తాకుతూ కీపర్ చేతుల్లోకి వెళ్లినట్లు కనిపించింది. అల్ట్రా ఎడ్జ్‌లో చిన్న స్పైక్ నమోదవడంతో హెట్‌మైర్ నిరాశగా మైదానం వీడాల్సి వచ్చింది. ఈ నిర్ణయంపై వెస్టిండీస్ హెడ్ కోచ్ Daren Sammy ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు కెమెరాలు చూపించాయి.హెట్మైర్ను బుమ్రా ఔట్ చేయడం ఇది ఆరోసారి కావడం విశేషం. అనంతరం క్రీజులోకి వచ్చిన షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ సింగిల్ తీసి రోస్టన్ ఛేజ్కు స్ట్రైక్ ఇచ్చాడు. అదే ఓవర్ ఐదో బంతికి ఛేజ్ డిఫెన్స్ ఆడగా బంతి గాల్లోకి ఎగిరింది. ఫార్వర్డ్ ఫీల్డర్‌గా ఉన్న Suryakumar Yadav అద్భుతంగా జంప్ చేసి క్యాచ్ అందుకోవడంతో ఛేజ్ ఇన్నింగ్స్‌కు తెరపడిందిఈ మ్యాచ్‌లో ఛేజ్కు పలుమార్లు లైఫ్ లభించింది. ఒకసారి రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకోగా, మరోసారి క్యాచ్ వదిలిపెట్టడంతో అదృష్టం కలిసి వచ్చింది. Abhishek Sharma ఎక్స్ట్రా కవర్స్‌లో వదిలిన సునాయాస క్యాచ్ వల్ల అతను 19 పరుగుల వద్ద ఔట్ కాకుండా నిలిచాడు. అయితే చివరికి బుమ్రా తన తదుపరి ఓవర్లోనే అతనిని పెవిలియన్ చేర్చి భారత జట్టుకు ఊపిరిపోశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa