మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న న్యూ మూవీ "వాల్తేరు వీరయ్య". బాబీ కొల్లి డైరెక్షన్లో పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటి వరకు వాల్తేరు వీరయ్య నుండి విడుదలైన రెండు లిరికల్స్ బాస్ పార్టీ, శ్రీదేవి - చిరంజీవి సాంగ్స్ చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ వాల్తేరు వీరయ్య నుండి థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ రోజు ఏ సమయంలోనైనా వీరయ్య టైటిల్ సాంగ్ విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది. మరి, వీరయ్య టైటిల్ సాంగ్ తో ముందస్తు న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ చేసుకోవడానికి బీ రెడీ ..!!