మాస్ రాజా రవితేజ "ధమాకా" థియేటర్లలో మాస్ రచ్చ చేస్తుంది. శుక్రవారం విడుదలైన ధమాకా ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ మూడురోజుల్లో ఇరు తెలుగు రాష్ట్రాలలో ధమాకా ధియేటర్లలన్నీ కూడా హౌస్ఫుల్ కావడం విశేషం. మూడ్రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 32కోట్ల గ్రాస్ వసూళ్లను వసూలు చేసిన ధమాకా కీలకమైన సోమవారం పరీక్షను డిస్టింక్షన్ లో పాసైనట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఇరు తెలుగు రాష్ట్రాలలోని ధమాకా థియేటర్లు ఉదయం మరియు మధ్యాహ్నం షోలకు ఆక్యుపెన్సీ చాలా బాగుందని తెలుస్తుంది.
శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రావురమేష్, జైరాం, హైపర్ ఆది, పవిత్రా లోకేష్ కీరోల్స్ లో నటించారు. భీమ్స్ సంగీతం అందించారు.