టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి చాలా సైలెంట్ గా తన 48వ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కీరోల్ ప్లే చేస్తున్నారు. మహేష్ బాబు పి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. యూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో 14వ ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ సినిమాకు రాధన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ రోజు హీరో నవీన్ పోలిశెట్టి పుట్టినరోజు కావడంతో మేకర్స్ ఈ సినిమా నుండి ఒక సర్ప్రైజింగ్ ఎనౌన్స్మెంట్ చేసారు. 'సిద్ధూ పోలిశెట్టి' ని పరిచయం చేస్తూ నవీన్ క్యారెక్టర్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సినిమాలో నవీన్ సింగర్ / స్టాండప్ కమెడియన్ గా నటించబోతున్నట్టు తెలుస్తుంది. పోతే, ఈ సినిమా నవీన్ నుండి రాబోతున్న మూడవ ప్రాజెక్ట్.
ఈ సినిమా నుండి రీసెంట్గానే అనుష్క ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో అనుష్క 'అన్విత రవళి శెట్టి' అనే ఒక చెఫ్ పాత్రలో నటిస్తుంది.