టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "టాప్ గేర్". డిసెంబర్ 30వ తేదీన విడుదల కావడానికి రెడీ ఐన ఈ సినిమా రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోబోతుంది. ఈ మేరకు కొంతసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. రేపు సాయంత్రం ఆరు గంటల నుండి హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో టాప్ గేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది.
రియా సుమన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను శశికాంత్ డైరెక్ట్ చేసారు. శ్రీధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.