ఈ ఏడాది రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఏమంత కలిసిరాలేదనే చెప్పాలి. భారీ అంచనాల నడుమ విడుదలైన "లైగర్" ఘోరపరాజయం పాలయ్యి, విజయ్ పాన్ ఇండియా ఆశలపై నీళ్లు చల్లేసింది. శివ నిర్వాణ డైరెక్షన్లో విజయ్ నటిస్తున్న ఖుషి సినిమా ఈ క్రిస్మస్ కు విడుదల కావాల్సి ఉండగా, సమంత అనారోగ్యం అందుకు సహకరించక ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే.
ఈ తరుణంలో విజయ్ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఒక సినిమాకు కమిటయ్యారన్న విషయం ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకు సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించనున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, న్యూ ఇయర్ లో ఈ న్యూ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టనున్నారట విజయ్. జనవరి 2023లో మంచి ముహూర్తం చూసుకుని మేకర్స్ ఈ సినిమాను స్టార్ట్ చెయ్యడానికి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.