పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతీ తో ఒక సినిమాను చేస్తున్నారు. ఇందులో మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది.
తాజాగా అందుతున్న సమాచారం మేరకు, రెండ్రోజుల నుండి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు విడుదలైన షూట్ లొకేషన్ పిక్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ కూడా అయ్యింది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్, డైలాగ్ డెలివరీ సూపర్బ్ గా ఉంటాయని తెలుస్తుంది. డార్లింగ్ నుండి అభిమానులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ను ఈ సినిమాలో మారుతీ పొందుపరుస్తున్నట్టు తెలుస్తుంది.