పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ మూవీ "ఖుషి". 2001 లో విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది. ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచింది. పోతే,ఈ సినిమా 2000లో విడుదలైన సూపర్ హిట్ తమిళ మూవీ 'ఖుషి' కి రీమేక్ గా రూపొందింది.
ఈ నెల 31వ తేదీన ఖుషి థియేటర్లలో రీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో నిర్మాత AM రత్నం మాట్లాడుతూ.. ఖుషి సినిమా తెలుగు వెర్షన్ కు తాము అనుకున్న మొదటి టైటిల్ 'చెప్పాలని ఉంది' అని, మెగాస్టార్ 'చూడాలని ఉంది' తరహాలో చెప్పాలని ఉంది టైటిల్ పెడదామని అనుకున్నాం...కానీ తమిళ టైటిల్ ఖుషిని ఫైనలైజ్ చేసాం.. అని చెప్పారు.