టాలీవుడ్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" అఖిల్ అక్కినేని నటిస్తున్న న్యూ మూవీ "ఏజెంట్". సురేందర్ రెడ్డి డైరెక్షన్లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీరోల్ లో నటిస్తున్నారు. టీజర్ తో ఆడియన్స్ లో ప్రకంపనలు సృష్టించిన ఈ సినిమాను మేకర్స్ సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాలు ఒక్కొక్కటిగా ప్రమోషన్స్ షురూ చేసి ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నాయి. కానీ, ఏజెంట్ మూవీ టీం నుండి ఎలాంటి అప్డేట్స్ లేవు.
ఈ తరుణంలో ఏజెంట్ రిలీజ్ పై తాజాగా ఆసక్తికర న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే, సంక్రాంతికి రావాల్సిన ఏజెంట్ ఒక నెల ఆలస్యంగా అంటే ఫిబ్రవరి 2023లో రాబోతున్నట్టు, ఈ మేరకు మేకర్స్ రిలీజ్ డేట్ ను ఆల్రెడీ ఫిక్స్ చేసారని, న్యూ ఇయర్ కానుకగా అక్కినేని అభిమానులకు ఏజెంట్ రిలీజ్ డేట్ పోస్టర్ ను సర్ప్రైజింగ్ గా విడుదల చెయ్యనున్నారని టాక్ నడుస్తుంది.