నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న కొత్త సినిమా "వీరసింహారెడ్డి". శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటివరకు ఈ సినిమా నుండి మూడు లిరికల్ సాంగ్స్ విడుదల కాగా... ఈ మూడు పాటలూ శ్రోతలను విపరీతంగా మెప్పించాయి. జై బాలయ్య మాస్ యాంథెం, సుగుణసుందరి ఫుట్ టాప్పింగ్ డ్యూయెట్, మా బావ మనోభావాలు ఊరమాస్ స్పెషల్ సాంగ్... ఇన్స్టంట్ చార్ట్ బస్టర్లుగా నిలిచి, యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోస్ లో దూసుకుపోతున్నాయి.
ఐతే, వీరసింహారెడ్డి ఫోర్త్ సింగిల్ పై లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ మూడు పాటలకు లిరిక్స్ అందించిన రామజోగయ్య శాస్త్రి గారు ఫోర్త్ సింగిల్ పై చిన్న ట్వీట్ పెట్టి ఆడియన్స్ లో అంచనాలను పెంచేశారు. జై బాలయ్య ...అరుపులు, సుగుణసుందరి ...కేకలు, మనోభావాల.. మంటలు.. చెప్పినట్టే జరిగింది.. నా లెక్క ప్రకారం, ఈసారొచ్చే పాట ఈ మూడు కలిపినంత.. ఏమంటారు గోపీచంద్ గారు...అంటూ శాస్త్రిగారు ట్వీట్ చేసారు.