బాబీ కొల్లి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి, మాస్ రాజా రవితేజ కలిసి నటిస్తున్న చిత్రం "వాల్తేరు వీరయ్య". సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతున్న ఈ సినిమా యొక్క టికెట్లు డిసెంబర్ 29 నుండి ఆన్లైన్ లో అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ మేరకు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
శృతి హాసన్, క్యాథెరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.