పరశురామ్ పెట్ల డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన ఔటండౌట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ "సర్కారువారిపాట". ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. థియేటర్లలో ఈ సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో, మ్యూజిక్ ఆల్బమ్ అంతకన్నా హిట్టయ్యిందన్న విషయం అందరికి తెలుసు. కళావతి, పెన్నీ, SVP టైటిల్ సాంగ్..అన్ని కూడా ప్రేక్షకులను విశేషంగా మెప్పించాయి.
ముఖ్యంగా థమన్ స్వరకల్పనలో, సిద్ శ్రీరామ్ మ్యాజికల్ వాయిస్ లో రూపొందిన కళావతి పాట ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. కళావతి హుక్ స్టెప్ పై సోషల్ మీడియాలో ఎన్ని రీల్స్ రూపొందాయో లెక్కే లేదు. ఇంతటి సెన్సేషనల్ సాంగ్ యూట్యూబులో 237 మిలియన్ వ్యూస్ ను, 2.5 మిలియన్ లైక్స్ ను రాబట్టి ఈ సంవత్సరంలో ఎక్కువమంది చూసిన తెలుగు పాటగా, ఎక్కువ మంది లైక్ చేసిన తెలుగు పాటగా రికార్డు సృష్టించింది.