నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఈ సంక్రాంతికి "వీరసింహారెడ్డి" గా థియేటర్లకు వచ్చి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించబోతున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో వీరసింహారెడ్డి మేకర్స్ మరో మూడ్రోజుల్లో అంటే డిసెంబర్ 29 నుండి ఆన్లైన్ టికెట్స్ బుకింగ్స్ ను ఆడియన్స్ కు అందుబాటులోకి తీసుకురానున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. జనవరి 11నుండి ప్రీమియర్స్ జరగనున్నాయి.