బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 5 విన్నర్ VJ సన్నీ హీరోగా నటిస్తున్న సినిమా "అన్స్టాపబుల్". ఈ సినిమాలో సప్తగిరి కీరోల్ లో నటిస్తున్నారు. డైమండ్ రత్నబాబు డైరెక్షన్లో ఔటండౌట్ ఫన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నక్షత్ర త్రినయని హీరోయిన్ గా నటిస్తుంది. A2B ప్రొడక్షన్స్ బ్యానర్ పై రంజిత్ రావు నిర్మిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. కింగ్ నాగార్జున ఈ మూవీ టీజర్ ను విడుదల చెయ్యడం జరిగింది. టీజర్ ఆద్యంతం ఎంటర్టైనింగ్ వే లో సాగింది. సన్నీ, సప్తగిరి కలిసి చేసే కిలాడీ పనులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉన్నాయి.