మాస్ రాజా రవితేజ నుండి వచ్చిన న్యూ ఫిలిం "ధమాకా". శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భీభత్సంగా దూసుకుపోతుంది. ఆడియన్స్, క్రిటిక్స్ ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. గుడ్ మౌత్ టాక్ తో, హౌస్ ఫుల్ థియేటర్ రన్ జరుపుకుంటున్న ధమాకా మూడ్రోజుల్లో వరల్డ్ వైడ్ గా 32కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుంది. ఈ రోజు బుకింగ్స్ కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి.
రవితేజ గత రెండు చిత్రాలు డిజాస్టర్లు అవ్వడం, హిట్ కొట్టాల్సిన సమయంలో ధమాకా వచ్చి ప్రేక్షకుల మెప్పును పొందడంతో.. ధమాకా మేకర్స్ ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ కు స్పెషల్ థాంక్స్ చెప్పేందుకు ఈ నెల 29న ఒక గ్రాండ్ మాస్ మీట్ ను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్ 29 సాయంత్రం 6గంటల నుండి హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్స్ లో ధమాకా మాస్ మీట్ జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa