స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే అందాల విందుతో రచ్చరంభోలా చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో ఇంటర్నెట్ లో హీటు పుట్టిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ వైరల్ గా మారాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే కొన్నాళ్లుగా బుట్టబొమ్మకు సరైన హిట్లు పడటం లేదు. తను ఓకే చేసిన సినిమాలు కూడా సాఫీగా సాగడం లేదు.
పూజా చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ‘ఎస్ఎస్ఎంబీ 28’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం షూటింగ్ కు కాస్తా బ్రేక్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక అటు హిందీలో బాలీవుడ్ బాయ్ జాన్ సరసన ‘కిసి కా బాయ్ కిసి కా జాన్’లోనూ నటిస్తోంది. ఈ చిత్రంతో బాలీవుడ్ లో తన సత్తా చూపించే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన కూడా నటించబోతుందని సమాచారం.పూజా హెగ్దే బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోలతోనూ నెట్టింట రచ్చచేస్తోంది. హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ మతులు పోగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. గోల్డ్ కలర్ ట్రెండీ వేర్ లో మతులు పోయేలా ఫోజులిచ్చింది. కసి చూపులతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Adorable @hegdepooja#PoojaHegde #TamilCinema #Sooriyanfm pic.twitter.com/4BvsBVbDYt
— SooriyanFM - சூரியன்FM (@SooriyanFMlk) December 27, 2022