నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్ స్టాపబుల్ టాక్ షో ఊహించిని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్నఈ టాక్ షోకు ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు వచ్చారు. కాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక దీనికి మించి ఉండేలా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ షోను ప్లాన్ చేస్తున్నారు. ఇవాళే పవన్ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుందట. పవన్ షూటింగ్ స్పాట్‌కి రాగానే అభిమానుల కోహాహలాలు మిన్నంటాయి. దీనికి సంబంధించి ఫోటోలు వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.