ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నైజాంలో 'ధమాకా' జోరు

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 27, 2022, 08:37 PM

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ "ధమాకా" సినిమా డిసెంబర్ 23, 2022న తెలుగు మరియు హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, మొదటి వారాంతం పూర్తి చేసుకున్న ఈ చిత్రం నైజాం రీజియన్ లో మూడో రోజు రెండు కోట్ల షేర్ సాధించింది. దీంతో ఈ సినిమా టోటల్ కలెక్షన్స్ నైజాంలో 5.7 కోట్ల షేర్ రాబట్టింది. రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ధమాకా సినిమా నిలిచింది.


ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, జయరామ్, రావు రమేష్, చిరాగ్ జానీ, అలీ, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.


ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa