పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ మూవీ "ఖుషి" ఈ నెల 31వ తేదీన రీ రిలీజ్ కాబోతుందన్న విషయం తెలిసిందే. దీంతో పవర్ స్టార్ అభిమానులు న్యూ ఇయర్ వేడుకలను థియేటర్లలో ఘనంగా జరుపుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'హరిహర వీరమల్లు' కి సంబంధించిన న్యూ గ్లిమ్స్ ను ఖుషి షోలలో స్పెషల్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ గా అటాచ్ చెయ్యబోతున్నారని ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ న్యూ ఇయర్ కి పవన్ నుండి ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా ట్రీట్ రాబోతుందని అంతా అనుకున్నారు. కానీ తాజాగా HHVM న్యూ గ్లిమ్స్ ఉండకపోవచ్చని కొంతమంది నుండి అందుతున్న సమాచారం. మరి, ఈ విషయంలో నిజానిజాల విషయం అటుంచితే, పవన్ అభిమానులు మాత్రం నిరాశకు గురవుతున్నారు.