రీసెంట్గా థియేటర్లలో విడుదలై, ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టి..బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం "మసూద". అద్భుతమైన ధియేటర్ రన్ తదుపరి కొన్ని రోజుల క్రితమే ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన మసూదకు డిజిటల్ ఆడియన్స్ నుండి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఆహా లో స్ట్రీమింగ్ కి వచ్చిన 48 గంటల్లో 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను పూర్తి చేసుకుని థ్రిల్లింగ్ హిట్ గా నిలిచిన మసూద, తాజాగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మార్క్ ను అందుకున్నట్టుగా తెలుస్తుంది. టోటల్గా ఆహాలో మసూదకు అద్దిరిపోయే రెస్పాన్స్ వస్తుందని తెలుస్తుంది.
కాగా, ఈ చిత్రాన్ని సాయి కిరణ్ డైరెక్ట్ చేసారు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. హీరోయిన్ సంగీత, తిరువీర్ రెడ్డి, కావ్యా కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.