మాస్ రాజా రవితేజ నటించిన "ధమాకా" ఇటీవలే థియేటర్లకు వచ్చి, ఘనవిజయం సాధించింది. కొంతమంది నుండి మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ ధమాకా బాక్సాఫీస్ వద్ద ధమఖేదర్ వసూళ్లను రాబడుతుంది. పక్కా కమర్షియల్ మాస్ మసాలా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పట్ల వారు చూపిస్తున్న ఆదరణ మరొక బిగ్ మాస్ మసాలా మూవీకి బీజం వేస్తుంది.
ధమాకా రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ కింగ్ నాగార్జునతో ఒక సినిమా చెయ్యబోతున్నట్టు, ధమాకా మూవీ రిజల్ట్ తదుపరి నాగ్ ఫైనల్ డెసిషన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారని గతంలో ప్రచారం జరగ్గా, ఈ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ గా పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. అదేంటంటే, ధమాకా బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర చేస్తున్న నేపథ్యంలో నాగ్ ప్రసన్న కుమార్ బెజవాడతో సినిమా తప్పకుండా చెయ్యాలని నిర్ణయించుకున్నారట. ఘోస్ట్ తదుపరి కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన నాగ్ ప్రసన్న తో సినిమాపై అతి త్వరలోనే అఫీషియల్ క్లారిటీ ఇవ్వనున్నారని తెలుస్తుంది.