ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మీనన్ విలన్ గా మారారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్ నటిస్తున్న సినిమాలో తాను విలన్ గా నటిస్తున్నానని గొతమ్ మీనన్ వెల్లడించారు. ఇటీవల లోకేశ్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్ మీనన్ ఈ విషయాన్ని ధృవీకరించాడు. ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్, త్రిష తదితరులు నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. జనవరి నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.