ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హరీష్ శంకర్ న్యూ ప్రాజెక్ట్ పై మేజర్ అప్డేట్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 29, 2022, 11:42 AM

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ పూజా కార్యక్రమం రీసెంట్గానే అంగరంగ వైభవంగా జరిగింది. ఐతే, ఈ ప్రాజెక్ట్ ను ప్రస్తుతం చేస్తున్న హరిహర వీరమల్లు తదుపరి పవన్ చేస్తున్నారా? లేదా ? అన్న విషయంపై అభిమానుల్లో సందేహం ఉంది.


ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో సినిమా చెయ్యబోతున్నాడని, ఈ ప్రాజెక్ట్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు నిర్మిస్తారని, అతి త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుందని ప్రచారం జరుగుతుండడంతో పవన్ అభిమానుల్లో మరింత కన్ఫ్యూషన్ నెలకొంది.


ఐతే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, హరీష్ శంకర్ - శివ కార్తికేయన్ - దిల్ రాజు సినిమాపై ఎలాంటి నిజం లేదని, ఈ వార్త కేవలం రూమర్ అని తెలుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com