తెలుసా మనసా
ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా
ఇది ఏజన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు
ఏడూ లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలెనాడు
వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల
బంగారు క్షణమిది
తెలుసా మనసా
ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా
ఇది ఏజన్మ సంబంధమో
ప్రతి క్షణం నా కళ్ళల్లో
నిలిచే నీ రూపం
బ్రతుకులో ఓ అడుగడుగునా
నడిపె నీ స్నేహమ్
ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా
పది కాలాలు వుంటాను
నీ ప్రేమ సాక్షిగా
తెలుసా మనసా
ఇది ఏనాటి అనుబంధమో
డార్లింగ్ ఎవరీ బ్రీత్ యు టేక్
ఎవరీ మూవ్ యు మేక్
ఐ విల్ బి థెర్
వాట్ వూడ్ ఐ డూ వితౌట్ యు
ఐ వాంట్ టూ లవ్ యు
ఫరెవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్
ఎన్నడూను తీరిపోని
రుణముగా ఉండిపో
చెలిమితో తీగసాగే
మల్లెగా అల్లుకో
లోకమే మారినా
కాలమే ఆగిన
మన ఈగాధ మిగలాలి
తుదిలేని చరితగా
తెలుసా మనసా
ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా
ఇది ఏజన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు
ఏడూ లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలెనాడు
వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల
బంగారు క్షణమిది
తెలుసా మనసా
ఇది ఏనాటి అనుబంధమో