కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం "రైటర్ పద్మభూషణ్". ఈ సినిమాతో టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. కొత్త దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ డైరెక్షన్లో ఫీల్ గుడ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాను జి మనోహరన్ సమర్పిస్తున్నారు. లహరి ఫిలిమ్స్, చాయ్ బిస్కట్ ఫిలిమ్స్ సంయుక్త బ్యానర్ లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహరన్ నిర్మిస్తున్నారు.
కొంతసేపటి క్రితమే ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ సరికొత్త పోస్టర్ ను మేకర్స్ విడుదల చెయ్యడం జరిగింది. ఈ మేరకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 3న రైటర్ పద్మభూషణ్ మూవీ థియేటర్లలో విడుదల కాబోతుందని తెలుస్తుంది.
ఆశిష్ విద్యార్ధి, రోహిణి మొల్లేటి కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో సుహాస్ అసిస్టెంట్ లైబ్రేరియన్ గా నటిస్తున్నారు.