ఈ యేడాదిని టాలీవుడ్ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. రెబల్ స్టార్, సూపర్ స్టార్ కొద్ది రోజుల వ్యవధిలోనే కన్నుమూయడం, ఆపై కైకాల సత్యనారాయణ గారు, చలపతి రావు గారు కూడా కాలం చేసి.. టాలీవుడ్ ను తీవ్ర విషాదంలోకి నెట్టేశారు.
లేటెస్ట్ గా టాలీవుడ్ లో మరొక సీనియర్ నటుడి మరణంతో విషాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి గారి ఐకానిక్ మూవీ "గ్యాంగ్ లీడర్" లో పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించిన వల్లభనేని జనార్దన్ గారు 63ఏళ్ళ వయసులో అనారోగ్యసమస్యలతో మరణించారు. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఈ రోజు ఉదయం జనార్దన్ గారు మరణించినట్టు సమాచారం.
డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన జనార్దన్ ఆపై నటుడిగా మారి వందకు పైగా సినిమాలలో విలన్, సపోర్టింగ్ రోల్స్ లో నటించారు. జనార్దన్ గారు పోలీస్ వేషాలను ఎక్కువగా వేసేవారు.