మెగాస్టార్ చిరంజీవి గారు, మాస్ రాజా రవితేజ గారు అన్నయ్య సినిమా తదుపరి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న చిత్రం "వాల్తేరు వీరయ్య". బాబీ కొల్లి డైరెక్షన్లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన థియేటర్లకు రాబోతుంది. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్య సినిమా నుండి ఒక్కొక్కటిగా లిరికల్ సాంగ్స్ విడుదలై శ్రోతలను అలరిస్తుండగా, తాజాగా మేకర్స్ నుండి అద్దిరిపోయే మెగా మాస్ సాంగ్ రిలీజ్ అప్డేట్ వచ్చింది.
చిరంజీవి, రవితేజ కలిసి మాస్ స్టెప్పులేసే ఈ ఊరమాస్ సాంగ్ ను రేపు రిలీజ్ చెయ్యబోతున్నట్టు మేకర్స్ కొంతసేపటి క్రితమే స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసి తెలియచేసారు. పోస్టర్ లో చిరు, రవితేజ డాన్స్ మూవ్మెంట్ స్టిల్ ఉండడంతో... ఈ సాంగ్ లో ఇద్దరి కలయికలో మంచి స్టెప్స్, కెమిస్ట్రీ చూడొచ్చని ఇరు స్టార్ హీరోల అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.