క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారి డైరెక్షన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా "రంగమార్తాండ". ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాగారు సంగీతం అందిస్తున్నారు. పోతే, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ప్రత్యేక భాగమైన విషయం తెలిసిందే.
రంగమార్తాండ సినిమా కోసం చిరు ఫస్ట్ టైం షాయరీ చెప్పారు. రీసెంట్గానే నేనొక నటుడ్ని అనే షాయరీ విడుదల కాగా, ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వచ్చింది. తాజాగా నేనొక నటుడ్ని షాయరీ యొక్క వీడియో వెర్షన్ విడుదలైంది.
నేనొక నటుడ్ని షాయరీ ఒక నటుడు స్వభావాన్ని, లక్ష్యాన్ని... ఎంతో హృద్యంగా తెలియచేస్తుంది. ముఖ్యంగా మెగాస్టార్ మాటల్లో ఈ షాయరీ మరింత భావోద్వేగభరితంగా, ఆలోచన చేసే విధంగా ... ఆడియన్స్ కు గూజ్ బంప్స్ కలిగించేలా ఉంది.