డిసెంబర్ 2వ తేదీన తెలుగు, తమిళ భాషలలో విడుదలైన "మట్టి కుస్తీ /గట్ట కుస్తీ" ఫ్యామిలీ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుని, బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ హీరోగా నటించగా, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించింది. చెల్లా అయ్యావు డైరెక్షన్లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను మాస్ రాజా రవితేజ గారు నిర్మించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.
తాజా అధికారిక సమాచారం ప్రకారం, న్యూ ఇయర్ 2023 కానుకగా మట్టి కుస్తీ/ గట్ట కుస్తీ డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ మేరకు జనవరి 1 నుండి ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో మట్టి కుస్తీ/ గట్ట కుస్తీ స్ట్రీమింగ్ కావడానికి రెడీ అవుతుందని సదరు సంస్థ నుండి అధికారిక ప్రకటన జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa