ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ "HHVM" లేటెస్ట్ అప్డేట్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 29, 2022, 06:56 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా "హరిహర వీరమల్లు". క్రిష్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా చాన్నాళ్ల బట్టి విడతలవారీగా షూటింగ్ జరుపుకుంటూ వస్తుందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ RFC లో శరవేగంగా జరుగుతుంది.


ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలకపాత్ర పోషించబోతున్నట్టు రీసెంట్గానే మేకర్స్ అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బాబీ డియోల్ ఈ సినిమాలో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారనే విషయంపై ఆసక్తికరమైన బజ్ వినిపిస్తుంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో నటిచబోతున్నారని టాక్ నడుస్తుంది. మరి, ఈ విషయంపై మేకర్స్ నుండి అధికారిక క్లారిటీ రావలసి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa