మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న న్యూ మూవీ "వాల్తేరు వీరయ్య" అదే టైటిల్ తో హిందీలో కూడా విడుదల కాబోతుంది. బాబీ కొల్లి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే నెల 13న విడుదల కావడానికి రెడీ అవుతుంది.
ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కీరోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇరువురి కలయికలో ఒక మాస్ సాంగ్ ను రూపొందించారు. మెగామాస్ టైటిల్ తో ఎనౌన్స్ చెయ్యబడిన ఈ సాంగ్ ఈ రోజు సాయంత్రం 06:03 నిమిషాలకు విడుదల కాబోతుందని మేకర్స్ తాజా సమాచారం అందించారు. పోతే, ఇరు తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చెయ్యబడిన ముఖ్యకేంద్రాల్లో, అభిమానుల కోలాహలం మధ్య మెగామాస్ సాంగ్ లాంచ్ గ్రాండ్ గా జరగబోతుంది.