సినిమా చూపిస్తా మావ, హలో గురూ ప్రేమ కోసమే చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాధరావు నుండి వచ్చిన న్యూ మూవీ "ధమాకా". మాస్ రాజా రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ రీసెంట్గానే విడుదలై ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ అందుకుంటుంది. రవితేజకు సరైన సమయంలో సూపర్ హిట్ అందించింది ధమాకా. ఇక, కలెక్షన్ల విషయానికొస్తే, ఏపీ, తెలంగాణా, ఓవర్సీస్ వంటి తేడా లేకుండా అన్నిచోట్లా దంచికొడుతుంది.
నేటితో ధమాకా థియేటర్లకొచ్చి వారం అవుతుంది. వరల్డ్ వైడ్ గా ఫస్ట్ వీక్ లో ధమాకా 62కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఇక, ఈ వారం కూడా చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ కాలేదు కాబట్టి మాస్ రాజా బాక్సాఫీస్ రాంపేజ్ కి ఎలాంటి అడ్డు ఉండదని క్లియర్ గా అర్ధమవుతుంది.
ఏదిఏమైనా..ధమాకా సినిమా మాస్ రాజా బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి ఇండస్ట్రీకి రుజువు చేసిందని తెలుస్తుంది.