నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్' ప్రోగ్రాంకి ప్రభాస్ గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు. ఎపిసోడ్ రిలీజ్ అయ్యాక ప్రభాస్ ఫ్యాన్స్ తాకిడికి ఆహా అప్లికేషన్ క్రాష్ అయింది. ఈ ఎపిసోడ్ లో బాలయ్య ఎప్పటిలాగే ఆసక్తికర ప్రశ్నలతో షోని నడిపించారు. ప్రభాస్ పెళ్లి గురించి, కృతి సనన్ తో రిలేషన్ గురించి ప్రశ్నలు అడిగారు. హీరో రామ్ చరణ్ కు ఫోన్ చేసి ప్రభాస్ గురించి మాట్లాడారు. బాలయ్య రామ్ చరణ్ తో 'ఇప్పుడు నువ్వు పాన్ ఇండియా స్టార్.. ప్రభాస్ కూడా పాన్ ఇండియా' అని అంటుడగా వెంటనే రామ్ చరణ్ ప్రబాస్ పాన్ వరల్డ్ స్టార్ అని అంటాడు. వెంటనే ప్రభాస్ 'చరణ్ డార్లింగ్ నాపైన పగపట్టేశావా' అని సరదాగా అంటాడు.