కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నుండి ఈ సంక్రాంతి కానుకగా 'వారిసు / వారసుడు' సినిమా రాబోతుందన్న విషయం తెలిసిందే. తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్లో, దిల్ రాజు నిర్మాణసారథ్యంలో ఫ్యామిలీ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా లో నేషనల్ క్రష్ రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా తదుపరి విజయ్ కోలీవుడ్ సెన్సేషన్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ఒక సినిమా చేసేందుకు సైన్ చేసారు. చడీచప్పుడు లేకుండా రీసెంట్గానే పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా తాజాగా ఈరోజు రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టిందని సమాచారం. ఐతే, ఈ విషయంపై కూడా మేకర్స్ నుండి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు. కానీ, అతి త్వరలోనే తలపతి 67 సినిమాను ఎనౌన్స్ చేస్తూ చిన్న గ్లిమ్స్ వీడియోను విడుదల చెయ్యబోతున్నారట. మరి, ఇందుకోసం తలపతి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.