తాలా అజిత్ కుమార్ నటిస్తున్న "తునివు" కోసం అభిమానులు కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో "తెగింపు" టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాకు హెచ్ వినోద్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఘిబ్రన్ సంగీతం అందిస్తున్నారు. పోతే, తెలుగులో "తెగింపు" టైటిల్ తో ఈ సంక్రాంతికి విడుదల కాబోతుంది.
తాజా సమాచారం ప్రకారం, తునివు సెన్సార్ పూర్తి చేసుకుందని తెలుస్తుంది. సెన్సార్ బృందం నుండి తునివు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఇక, సినిమా నిడివి వచ్చేసి 145 నిమిషాల 48 సెకన్లు అని తెలుస్తుంది.